Share News

ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన విద్యాబోధన జరగాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:51 PM

హవేళిఘణపూర్‌, జూన్‌ 6: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యాబోధన జరగాలని మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన విద్యాబోధన జరగాలి
కూచన్‌పల్లిలో పాఠశాల్లో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

హవేళిఘణపూర్‌, జూన్‌ 6: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యాబోధన జరగాలని మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కూచన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మరమ్మతు పనులను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. అధికారులు పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. బడి మానేసిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ నారాయణ, ప్రధానోపాధ్యాయుడు మధుమోహన్‌ తదితరులు ఉన్నారు. అలాగే ఫరీద్‌పూర్‌ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిఫాం కుట్టు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

Updated Date - Jun 06 , 2024 | 10:51 PM