రూ.65 కోట్ల కథ కంచికి..!
ABN , Publish Date - Feb 12 , 2024 | 11:30 PM
నర్సాపూర్, ఫిబ్రవరి 12: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నర్సాపూర్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.56 కోట్ల ప్రత్యేక నిధులకు సంబంధించిన పనులు సకాలంలో కాకపోవడంతో ఆ నిధులన్నీ ఆపేశారు.
నిలిచిపోయిన మున్సిపల్ ప్రత్యేక నిధులు
సకాలంలో పనులు కాకపోవడంతో ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచిన వైనం
నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు ఆటంకం
నర్సాపూర్, ఫిబ్రవరి 12: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నర్సాపూర్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.56 కోట్ల ప్రత్యేక నిధులకు సంబంధించిన పనులు సకాలంలో కాకపోవడంతో ఆ నిధులన్నీ ఆపేశారు. దీంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్ని మొదలే కాలేదు. 2022లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ పట్టణానికి వచ్చిన సందర్భంగా మున్సిపల్‌కు స్పెషల్ డెవల్‌పమెంట్ ఫండ్స్ రూ.25 కోట్లు మంజూరు చేశారు. వాటితో పాటు టీఎ్‌సఎ్‌ఫడీసీ ద్వారా రూ.25 కోట్లు, ఓసారి రూ.15 కోట్లు, మొత్తం రూ.65కోట్లు మంజూరయ్యాయి. అందులో ఎఫ్‌డీసీ ద్వారా మంజూరైన రూ.15 కోట్లలో కేవలం రూ.4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక స్పెషల్ డెవల్‌పమెంట్ నిధులతో పట్టణంలో సమీకృత మార్కెట్, మున్సిపల్ భవనం, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, మినీ స్టేడియం, కులసంఘాలకు కమ్యునిటీ భవనాలు నిర్మించాలని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేశారు. వీటితోపాటు ప్రతి వార్డులో సీసీరోడ్లు, అంతర్గత డ్రైనేజీలను కూడా నిర్మించాలని నిర్ణయించారు. అయితే అందులో ఇప్పటివరకు పలు వార్డుల్లో సీసీరోడ్లు, అంతర్గత డ్రైనేజీలతో పాటు డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, మున్సిపల్, సమీకృత భవనాల పనులు ప్రారంభం కాగా.. మిగతా అభివృద్ధి పనులు స్థలం ఎంపికలో జాప్యం జరగడంతో ఇంకా మొదలు కాలేదు. మొన్నటివరకు మున్సిపల్‌చైర్మన్‌గా ఉన్న మురళీధర్‌యాదవ్ మొదట్లో బీఆర్‌ఎ్‌సలో ఉండగా ఏడాదిక్రితం బీజేపీలో చేరారు. దీంతో అప్పటి ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను చైర్మన్ పార్టీ మారడంతో కేటాయించడంలో నిర్లక్ష్యం చేసిందన్న ప్రచారం జరిగింది. ప్రారంభమైన పనులు కూడా ఎప్పుడో పూర్తికావాల్సి ఉన్నా సకాలంలో నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా నిదానంగా చేస్తూ వచ్చారు.
హోల్డ్‌లో రూ.56 కోట్లు
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వంలో మంజూరైన రూ.65 కోట్ల ప్రత్యేక నిధుల్లో రూ.56 కోట్ల మేర హోల్డ్‌లో ఉంచారని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కొనసాగుతున్న పనులతో పాటు చివరి దశలో ఉన్న శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, సమీకృత మార్కెట్ పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఈ మధ్యనే నిర్వహించిన చైర్మన్ ఓటింగ్‌లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అశోక్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా నియామకమైనప్పటి నుంచి పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో నిధులు తీసుకురావాలని తీర్మానం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో నిధులు వచ్చేలా చూస్తాం
నర్సాపూర్ మున్సిపల్ పట్టణానికి మంజూరైన ప్రత్యేక నిధుల్లో రూ.56 కోట్లు నిలిచిపోయిన విషయం వాస్తవమే. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మళ్లీ నిధులు వచ్చేలా ప్రయత్నిస్తాం. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం.
- అశోక్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్