Share News

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 27 , 2024 | 11:28 PM

సంగారెడ్డి అర్బన్‌, మే 27: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు.

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

సంగారెడ్డి అర్బన్‌, మే 27: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. సంగారెడ్డిలోని స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన రూట్‌ ఆఫీసర్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, కస్టోడియన్స్‌తో సమావేశమై మాట్లాడారు. జూన్‌ 3 నుంచి 13వ తేదీవరకు పదో తరగతి అడ్వాన్స్‌ సిప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. 525 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. సంగారెడ్డిలోని కరుణ హైస్కూల్‌, రామచంద్రాపురం జడ్పీహైస్కూల్‌, జహీరాబాద్‌లోని సిద్ధార్థ హైస్కూల్‌లో పరీక్షలు జరుగుతాయని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ మణిదీప, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో పనులు పూర్తి చేయాలి

నర్సాపూర్‌, మే 27: జూన్‌ 5లోపు పాఠశాలలో చేపట్టిన సివిల్‌ పనులు పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్‌ ఎంఈవో కార్యాలయంలో ఆదర్శ పాఠశాలలోని సివిల్‌ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా మౌలిక సదుపాయల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

సకాలంలో యూనిఫాంలు అందజేయాలి

మనూరు, మే 27: విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందజేయాలని అదనపు డీఆర్డీవో జంగారెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రమైన మనూరులో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి కుట్టుమిషన్‌ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. విద్యార్థుల దుస్తువులు నాణ్యతతో కుట్టి పాఠశాలల ప్రారంభంలోనే అందజేయాలన్నారు. ఆయన వెంట ఐకేపీ డీపీఎం జయశ్రీ, ఏపీఎం వంశీక్రిష్ణ, తదితరులు ఉన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:28 PM