Share News

వర్షాకాలంలో వ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:49 PM

మనోహరాబాద్‌, జూన్‌ 6: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మెదక్‌ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌ ఆశావర్కర్లకు సూచించారు.

వర్షాకాలంలో వ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టండి
ఆశావర్కర్లతో మాట్లాడుతున్న మెదక్‌ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌

మెదక్‌ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌

మనోహరాబాద్‌, జూన్‌ 6: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మెదక్‌ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌ ఆశావర్కర్లకు సూచించారు. గురువారం తూప్రాన్‌, మనోహరాబాద్‌ ఉమ్మడి మండలాల ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలతో మనోహరాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రం ప్రోగ్రాం అధికారి నవీన్‌కుమార్‌, మండల వైద్యాధికారి వికా్‌సతో కలిసి మాట్లాడారు. వర్షాకాలంలో ప్రజలకు సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, అలాచేసిన వారిపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్‌ సూపరింటెండెంట్‌ అమీర్‌సింగ్‌, డీడీవో వికాస్‌, బాలనర్సయ్య, సీహెచ్‌వో వైష్ణవి, సాలుబై, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 10:49 PM