Share News

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:23 PM

డీఆర్‌వోకు సీపీఎం నాయకుల వినతి

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి
సంగారెడ్డి కలెక్టరేట్‌లో డీఆర్‌వో నగేష్‌గౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న సీపీఎం నాయకులు

సంగారెడ్డి రూరల్‌, జనవరి 8: జిల్లాలో పెరిగిపోతున్న కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌వో నగే్‌షగౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేసి మాట్లాడారు. జిల్లాలోని పటాన్‌చెరు, జిన్నారం, హత్నూర, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో పరిశ్రమల వల్ల చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం, జిన్నారం పారిశ్రామిక వాడల వల్ల పలు గ్రామాల్లో మంజీర నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమల్లో తనిఖీలు చేయని పీసీబీ అధికారులపై కూడా చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఆయన కోరారు. పరిశ్రమల నుంచి కలుషిత వ్యర్థాలు ఇష్టారీతిని వెలువరించకుండా చూడాలని కోరారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, రాజయ్య, బాబురావు ఉన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:24 PM