Share News

నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు చర్యలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:21 PM

రాష్ట్రంలో మూతపడిన నిజాం షుగర్స్‌ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు.

నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు చర్యలు

అధ్యయనానికి మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కమిటీ

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

రాయికోడ్‌ మండలం మాటూరు వద్ద ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

రాయికోడ్‌, జనవరి 12: రాష్ట్రంలో మూతపడిన నిజాం షుగర్స్‌ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. ఇందుకోసం మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కమిటీని వేయనున్నట్టు ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండల పరిధిలోని మాటూరు గ్రామ శివారులో అగ్రిప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ షుగర్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రపరికరాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో రైతులు పండించిన చెరకును కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలించడానికి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటయితే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ఇందుకోసం ముందుకువచ్చేవారికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఎంపీ బీబీపాటిల్‌ మాట్లాడుతూ బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనులు త్వరగా ప్రారంభిస్తే ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని పేర్కొన్నారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి మాట్లాడుతూ రైతులకు సబ్సీడీపై యంత్రపరికరాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సురే్‌షకుమార్‌షెట్కార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మాధురి, పంచగామ పీఠాధిపతికాశీనాథ్‌బాబా, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, ఎంపీపీ మమత, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అంజయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీనర్సింలు, దిగంబర్‌రావు, సతీ్‌షకుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌చారి, జహీరాబాద్‌ ఆర్డీవో వెంకటరెడ్డి, సర్పంచ్‌లు ప్రవీణ్‌కుమార్‌, రాధికా సతీ్‌షకుమార్‌, ఎంపీటీసీలు పండరి, శివకుమార్‌పాటిల్‌, నాయకులు వినోద్‌పాటిల్‌, సిద్దన్నపాటిల్‌, బస్వరాజ్‌పాటిల్‌, హన్మంతురావుపాటిల్‌, ఆయా గ్రామాల రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:21 PM