Share News

పతి కోసం సతి ప్రచారం

ABN , Publish Date - May 01 , 2024 | 11:22 PM

మెదక్‌ మున్సిపాలిటీ, మే 1: పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి తన భర్త వెంకట్రామారెడ్డిని గెలిపించాలంటూ ఆయన సతీమణి ప్రణతిరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

పతి కోసం సతి ప్రచారం
తన భర్తను గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి సతీమణి ప్రణతిరెడ్డి

ఓటర్లను కలుస్తూ.. గెలిపించాలని కోరుతూ..

ఇంటింటి ప్రచారంలో వెంకట్రామారెడ్డి సతీమణి

మెదక్‌ మున్సిపాలిటీ, మే 1: పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి తన భర్త వెంకట్రామారెడ్డిని గెలిపించాలంటూ ఆయన సతీమణి ప్రణతిరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలోని 11, 18వ వార్డుల్లో స్థానిక నేతలతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లారు. గతంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సుపరిచితుడని ఓటర్లకు గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ తీరును చూసి ఓటు వేయాలని కోరారు. తన భర్తను గెలిపిస్తే.. రూ.100 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేయబోతున్నామని, అంతేకాకుండా ఉచితంగా ఒక్క రూపాయికే వివాహాలు జరుపుకునేందుకు ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలుతీరుపై ఓటు అడిగేందుకు వచ్చే నాయకులను ప్రశ్నించాలన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు రైతు రుణమాఫీ, రైతుబంధు లక్ష్యాలను చేరుకోలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలనే ఇప్పటికీ పూర్తిచేయని కాంగ్రె్‌సకు, ఎటువంటి సిద్ధాంతం లేని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకే ఓటు వేసి తన భర్తను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట కుమారుడు భరత్‌రాజ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, కౌన్సిలర్లు ఆర్‌కె శ్రీనివాస్‌, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, సులోచనాప్రభురెడ్డి, బట్టి లలిత, ఆరేళ్ల గాయత్రి, నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్‌ ఉన్నారు.

మామ కోసం కోడలు ప్రచారం

జగదేవ్‌పూర్‌, మే 1: బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా తన కోడలు శాలినిరెడ్డి బుధవారం మండలంలోని మునిగడప గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్తూ మహిళలను కలిసి కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత, శ్రీనివా్‌సరెడ్డి, కావ్య, దుర్గయ్య, మాజీ సర్పంచ్‌ బాలలక్ష్మి, నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:22 PM