Share News

పారిశుధ్య గ్రామాలు ఆరోగ్యానికి నిలయాలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:33 PM

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి నాటిన మొక్కలను కాపాడుకోవాలి సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి నందికందిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

పారిశుధ్య గ్రామాలు ఆరోగ్యానికి నిలయాలు
నందికంది గ్రామసభలో మాట్లాడుతున్న కలెక్టర్‌

సదాశివపేట, ఫ్రిబవరి 7: పారిశుధ్య గ్రామాలు ఆరోగ్య నిలయాలుగా నిలుస్తాయని, గ్రామాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం సదాశివపేట మండలం నందికంది గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్‌ పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి నీటి సరఫరా జరగాలని, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పైప్‌లైన్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామంలో నాటిన చెట్లను సంరక్షించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్త్ర, కాగితం సంచులను వాడాలన్నారు. నందికంది గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు భవనాలను, స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సామ్‌ మామ్‌ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పౌష్టికాహారం అందించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీఎల్వో సతీ్‌షరెడ్డి, ఎంపీడీవో పూజ, తహసీల్దార్‌ కె.సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:33 PM