Share News

దేవాదుల కెనాల్‌లో పోసిన మట్టి తొలగింపు

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:46 PM

చేర్యాల/కొండపాక, మార్చి 27: కొమురవెల్లి మండలం తపా్‌సపల్లి రిజర్వాయర్‌ నుంచి కొండపాక మండలానికి సాగునీరు రాకుండా మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రిజర్వాయర్‌ డీ4 కెనాల్‌లో వేరే ప్రాంతానికి చెందిన కొంతమంది మట్టిపోసి అడ్డుకట్ట వేశారు.

దేవాదుల కెనాల్‌లో పోసిన మట్టి తొలగింపు
తపా్‌సపల్లి కెనాల్‌ లో వేసిన మట్టిని తొలగిస్తున్న దృశ్యం

కొండపాక మండలానికి నీటి విడుదలకు లైన్‌క్లియర్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

చేర్యాల/కొండపాక, మార్చి 27: కొమురవెల్లి మండలం తపా్‌సపల్లి రిజర్వాయర్‌ నుంచి కొండపాక మండలానికి సాగునీరు రాకుండా మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రిజర్వాయర్‌ డీ4 కెనాల్‌లో వేరే ప్రాంతానికి చెందిన కొంతమంది మట్టిపోసి అడ్డుకట్ట వేశారు. ఈనెల 23న ‘కెనాల్‌కు అడ్డుకట్ట.. సాగునీటి గోస’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై అధికారులు స్పందించి కాలువలో పోయించిన మట్టి, మొరాన్ని బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా దేవాదుల ఏఈఈ రాజశేఖర్‌, కొమురవెల్లి ఎస్‌ఐ నాగరాజు పోలీసు బందోబస్తు నడుమ ఎక్స్‌కవేటర్లతో మట్టిని తొలగింపచేశారు. కొద్దిరోజుల క్రితం దేవాదుల గంగారం నుంచి పంపింగ్‌ ప్రారంభించగా, బొమ్మకూరు రిజర్వాయర్‌ నుంచి తపా్‌సపల్లి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించారు. రెండురోజుల క్రితం నీటి పంపింగ్‌ నిలిచిపోగా, బుధవారం తిరిగి పంపింగ్‌ ప్రారంభించారు. చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతుండగా ముందస్తుగా ఇక్కడి రైతులకు నీటి విడుదల చేసిన అనంతరం కొండపాకకు మళ్లించాలని స్థానిక రైతులు కోరడంతో కొద్దిరోజుల క్రితం కాలువలో మట్టిపోయించడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై రాజకీయ ఒత్తిళ్లతో మట్టిని తొలగింప చేయడంతో కొండపాక మండలానికి నీటి తరలింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇదిలా ఉండగా కొమురవెల్లి మండలం తపా్‌సపల్లి రిజర్వాయర్‌ నుంచి సాగునీటిని విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ కొమురవెల్లి మండల నాయకులు బుధవారం జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డిని కోరారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయ డైరెక్టర్‌ మేడికుంట శ్రీనివాస్‌, నాయకులు ఎక్కలదేవి శ్రీనివాస్‌, పబ్బోజు రాములుచారి, గొల్లపల్లి శ్రీనివాస్‌, పోతుగంటి రవి తదితరులు హైదరాబాద్‌లో కొమ్మూరిని కలిశారు. చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకునేందుకు సాగునీటిని అందించేలా సంబంధిత అధికారుల తో సంప్రదించి పరిష్కరించాలని కోరారు. దీంతో కొమ్మూరి సానుకూలంగా స్పందించారు.

Updated Date - Mar 27 , 2024 | 11:46 PM