Share News

‘ప్రజావాణి’ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:03 PM

సిద్దిపేట అగ్రికల్చర్‌, మార్చి 4: ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు.

‘ప్రజావాణి’ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మనుచౌదరి

సిద్దిపేట కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి

సిద్దిపేట అగ్రికల్చర్‌, మార్చి 4: ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన ఆయా ఫిర్యాదులకు, ఆర్జీలకు సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణికి వచ్చిన వారిని పోలీసులు క్షణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్‌ ఆర్యా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లస్థలాలను బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేసిండ్రు

1999లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో 2.20 ఎకరాల భూమిని 80 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలకు ఇచ్చి పట్టాలు అందించారని, దీనిని బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేశారని కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి మీ స్థలాన్ని అందేలా చూస్తానని కలెక్టర్‌ హామీఇచ్చారు.

మా భూమిని మాకు ఇవ్వాలి

మా భూమి మాకు ఇవ్వాలని రంగధాంపల్లికి చెందిన అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 966 సర్వే నెంబర్లు 1.21 ఎకరాల భూమిని దహన సంస్కారాలకు కేటాయించామని, ఎలాంటి సమాచారం లేకుండా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ నిర్మాణం కోసం ప్రొసీడింగ్‌ ఇచ్చారని అన్నారు. దానిని వెంటనే రద్దు చేసి శ్మశానానికి కేటాయించి నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.

Updated Date - Mar 04 , 2024 | 11:03 PM