Share News

అవినీతి బీఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొట్టారు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:41 PM

మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

అవినీతి బీఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొట్టారు
రామాయంపేటలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

చిన్నశంకరంపేట/రామాయంపేట, పిబ్రవరి 1: అవినీతి బీఆర్‌ఎ్‌సను ప్రజలు తరిమికొట్టారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. గురువారం చిన్నశంకరంపేట, రామాయంపేట ఉమ్మడి మండల బీజేపీ కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలతోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలంటే ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయి నుంచి పని చేయాలన్నారు. ఆయా సమావేశాల్లో సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, మెదక్‌ బీజేపీ ఇన్‌చార్జి పంజా విజయ్‌కుమార్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజు, నాయకులు సుధాకర్‌రెడ్డి, రాగి రాములు, బాలరాజ్‌, శంకర్‌గౌడ్‌, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:41 PM