Share News

సంగారెడ్డి-జోగిపేట రైల్వే లైన్‌పై కదలిక

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:19 PM

జోగిపేట, జూన్‌ 26: గతంలో ప్రతిపాదించిన వట్టి నాగులపల్లి-సంగారెడ్డి- జోగిపేట-మెదక్‌ రైల్వే లైన్‌తోపాటు, వట్టి నాగులపల్లి-సంగారెడ్డి- జోగిపేట మీదుగా ఆదిలాబాద్‌కు రైల్వే లైన్లను ఏర్పాటులో కదలిక ప్రారంభమైందని రైల్వే సాధన సమితి కన్వీనర్‌, జోగిపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంగా జోగినాథ్‌గుప్తా అన్నారు.

సంగారెడ్డి-జోగిపేట రైల్వే లైన్‌పై కదలిక
మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు రైల్వే లైన్‌ గురించి వివరిస్తున్న జోగినాథ్‌గుప్తా

మెదక్‌ ఎంపీ, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం హామీ

రైల్వే సాధన సమితి కన్వీనర్‌ గంగా జోగినాథ్‌గుప్తా

జోగిపేట, జూన్‌ 26: గతంలో ప్రతిపాదించిన వట్టి నాగులపల్లి-సంగారెడ్డి- జోగిపేట-మెదక్‌ రైల్వే లైన్‌తోపాటు, వట్టి నాగులపల్లి-సంగారెడ్డి- జోగిపేట మీదుగా ఆదిలాబాద్‌కు రైల్వే లైన్లను ఏర్పాటులో కదలిక ప్రారంభమైందని రైల్వే సాధన సమితి కన్వీనర్‌, జోగిపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంగా జోగినాథ్‌గుప్తా అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలంటూ సోమవారం ఉదయం తాను బీజేపీ సీనియర్‌ నాయకులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, అనంతరావు కులకర్ణిలతో కలిసి దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఏ.శ్రీధర్‌, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావును వేర్వేరుగా కలిశామన్నారు. వట్టి నాగులపల్లి-పటాన్‌చెరు-సంగారెడ్డి- జోగిపేటల మీదుగా మెదక్‌కు ఒక రైల్వే లైన్‌ను, వట్టి నాగులపల్లి- పటాన్‌చెరు-సంగారెడ్డి-జోగిపేట-నారాయణఖేడ్‌ల మీదుగా ఆదిలాబాద్‌ వరకు మరో రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలంటూ... 15 ఏళ్లుగా తాను ప్రతీ ఎంపీ, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ద్వారా, స్వయంగా ఢిల్లీలోని రైల్వే బోర్డు కార్యాలయాలకు తిరుగుతూ, రైల్వే మంత్రులు, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులను సమర్పించానని ఎంపీ, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎంలకు వివరించానన్నారు. వారందరి సహకారంతో వట్టి నాగులపల్లి- సంగారెడ్డి-జోగిపేట-మెదక్‌ రైల్వే లైన్‌ కోసం సర్వే పనులకు నిధులు మంజూరై, మొదటి దఫా సర్వే పూర్తయిందని వివరించానని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత కృషిచేస్తే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే లైన్‌ కల సాకారమౌతుందని వారిని కోరానని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మూడునెలల్లో ఈ రెండు రైల్వే లైన్ల కోసం చివరి సర్వేను పూర్తి చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఏ.శ్రీధర్‌, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు హామీనిచ్చారన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 11:19 PM