సిద్దిపేట కలెక్టర్‌గా మను చౌదరి
ABN , Publish Date - Feb 23 , 2024 | 11:28 PM
సిద్దిపేట కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. ఇంతకాలం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రశాంత్ జీవన్‌పాటిల్ ను సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు
సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ జీవన్‌పాటిల్ బదిలీ
సిద్దిపేట అగ్రికల్చర్, ఫిబ్రవరి 23: సిద్దిపేట కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. ఇంతకాలం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రశాంత్ జీవన్‌పాటిల్ ను సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రశాంత్ జీవన్‌పాటిల్ స్వస్థలం మహారాష్ట్ర. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన సిద్దిపేట కలెక్టర్‌గా జూన్ 13, 2022 నుంచి బాధ్యతలు నిర్వర్తించారు. వివాదరహితుడు, సమర్థవంతమైన అధికారిగా ఆయనకు పేరుంది. వరంగల్ రూరల్, వరంగల్ అర్భన్, నల్లగొండ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
తల్లి ఆశయం కోసం..
సిద్దిపేట నూతన కలెక్టర్‌గా రానున్న మిక్కిలినేని మను చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మం డలం దెందుకూరు. ఆయన తండ్రి రాజబాబు ఓరియెంట్ సిమెంట్ కంపెనీలో సీనియర్ కెమి్‌స్టగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి భారతి కోరిక మేరకు మను చౌదరి సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే 2017లో ఆలిండియా 36వ ర్యాంకు సాధించాడు. మనుచౌదరి గతంలో నాగర్‌కర్నూల్, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.