Share News

జూలై 7న వరంగల్‌లో మాదిగల కవాతు

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:30 PM

లక్షలాదిమందితో నిర్వహించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకుల పిలుపు

జూలై 7న వరంగల్‌లో మాదిగల కవాతు
సమావేశంలో అభివాదం చేస్తున్న నాయకులు

సిద్దిపేట అగ్రికల్చర్‌ జూన్‌ 7: ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జూలై 7న వరంగల్‌లో లక్షలాదిమందితో జరిగే మాదిగల కవాతును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నేతలు లింగంపల్లి శ్రీనివాస్‌, పరుశురాములు, మల్లిగారి యాదగిరిలు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్‌, అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సభ అధ్యక్షత ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎ్‌సపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం, జిల్లా ఇన్‌చార్జి యాదగిరి, మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, ఎంఈఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూలై 7న ఎమ్మార్పీఎస్‌ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగే మాదిగల కవాతును విజయవంతం చేయాలని, ఇందుకు ప్రతి గ్రామంలో వందలాది మంది విద్యార్థులతో సన్నాహక కవాతులు, సదస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:30 PM