Share News

పాపన్నపేటను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:40 PM

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

పాపన్నపేటను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
పోడ్చన్‌పల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌

పాపన్నపేట, ఫిబ్రవరి 1: పాపన్నపేట మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఎల్లాపూర్‌లో అంగన్‌వాడీ భవనం, పశువైద్యశాలలను, పొడ్చన్‌పల్లిలో పశువైద్యశాల, అంగన్‌వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లక్ష్మినగర్‌లో కాంగ్రె్‌సపార్టీ జెండాను ఎగురవేశారు. యూసు్‌ఫపేట, కుర్తివాడ, డౌలాపూర్‌, రాజ్యాతండా, డాక్యా తండాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. అధికారులు ప్రజలకు జవాబుదారిగా పని చేయాలని సూచించారు. పొడ్చన్‌పల్లి పాఠశాలలో మరుగుదొడ్లు, ఎల్లాపూర్‌ పాఠశాలలో ప్రహరీల నిర్మాణానికి సహకరిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ చందనరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ప్రశాంత్‌రెడ్డి, జిల్లా కిసాన్‌ సెల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గోవింద్‌నాయక్‌, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యుడు గౌస్‌, పీఆర్‌డీఈ పాండురంగారెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్‌ ఎన్‌.జీవన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి, ఎల్లాపూర్‌ ఎంపీటీసీ వసంతశ్రీనివా్‌సరెడ్డి, ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ శ్రీధర్‌, కృష్ణారెడ్డి, నాయకులు సంతో్‌షరెడ్డి, శెట్టి శ్రీకాంత్‌ ఉన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:40 PM