Share News

పారదర్శకంగా ఈవీఎంల తనిఖీ: మెదక్‌ కలెక్టర్‌

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:54 PM

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 7: జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల మొదటిస్థాయి తనిఖీలను పారదర్శకంగా ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు.

పారదర్శకంగా ఈవీఎంల తనిఖీ: మెదక్‌ కలెక్టర్‌
స్ర్టాంగ్‌రూం గది సీల్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 7: జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల మొదటిస్థాయి తనిఖీలను పారదర్శకంగా ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. బుధవారం స్థానిక గోడన్‌లో ఎఫ్‌ఎల్‌సీ, వెబ్‌కాస్టింగ్‌, ఈవీఎంల నిర్వహణ విధానాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్లు(బియూ) కంట్రోలింగ్‌ యూనిట్‌(సీయూ) వీవీ ప్యాట్ల యంత్రాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:54 PM