Share News

అక్కడ దించేస్తే.. ఇక్కడ ఎక్కేస్తాం!

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:59 PM

గుమ్మడిదల మండలంలో రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో మండలంలోనూ రాజకీయాలు మారిపోయాయి.

అక్కడ దించేస్తే..  ఇక్కడ ఎక్కేస్తాం!

జిన్నారం రాజకీయం.. గుమ్మడిదలపై ప్రభావం

ఎంపీపీ పీఠానికి పొంచిఉన్న ప్రమాదం

అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్‌ ఎంపీటీసీలు సన్నద్ధం

గుమ్మడిదల, ఫిబ్రవరి 17: గుమ్మడిదల మండలంలో రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో మండలంలోనూ రాజకీయాలు మారిపోయాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గెలిచినా.. మండలంలో మెజార్టీ రాకపోవడంతో ఆయన స్థానిక రాజకీయాలను, నాయకులను పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జిన్నారం మండల ఎంపీపీ(కాంగ్రె్‌స)పై బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడంతో ఆ ప్రభావం గుమ్మడిదల మండలంపై చూపే అవకాశం కనిపిస్తున్నది. గుమ్మడిదల మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 7 స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకుని ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ మూడు స్థానాలకే పరిమితమైంది. కానీ ఇటీవల రాష్ట్రంలో అధికారం మారడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు కాంగ్రె్‌సలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్నారం ఎంపీటీసీ బేగర్‌ లక్ష్మి, గుమ్మడిదల ఎంపీటీసీ రాజ్యలక్ష్మి ఇటీవల బీఆర్‌ఎ్‌సకు రాజీనామాచేసి కాంగ్రె్‌సలో చేరారు. దీంతో ప్రస్తుతం మండల పరిషత్‌లో ఇరు పార్టీ బలాబలాలు సమానమయ్యాయి. బీఆర్‌ఎస్‌ నుంచి మరో ఎంపీటీసీ కాంగ్రె్‌సలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం నేపథ్యంలో ఎంపీపీపై అవిశ్వాసానికి కాంగ్రెస్‌ సభ్యులు సిద్ధమవుతున్నారు. ఐదు నెలల పదవీ కాలం మాత్రమే ఉండడంతో ఇప్పుడు అవిశ్వాసం అవసరమా అంటే.. జిన్నారంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెట్టగా లేనిది తామెందుకు పెట్టకూడదని వారు సమాధానమిస్తున్నారు. మరోవైపు స్థానిక రాజకీయలను సీరియ్‌సగా తీసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం గుమ్మడిదల, జిన్నారం మండల నాయకులను ఆదేశించినట్టు తెలిసింది. జిన్నారంలో ఎంపీపీపై అవిశ్వాసంలో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే.. గుమ్మడిదలలో బీఆర్‌ఎస్‌ ఎంపీపీపై అవిశ్వాసం పెట్టాలని నియోజకవర్గ నాయకులకు నిర్దేశించినట్టు కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని కీలక నేత ఇంట్లో దీనిపై చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ నెల 26న జిన్నారంలో జరిగే అవిశ్వాస తీర్మానం ఫలితం ఆధారంగా గుమ్మడిదల మండలంలోనూ రాజకీయాలు మరే అవకాశం కనిపిస్తున్నది.

అవిశ్వాస సమావేశం కోసం ఎదురుచూపులు

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 17: సంగారెడ్డి గ్రేడ్‌వన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సమావేశం ఏర్పాటు కోసం కౌన్సిలర్లు ఎదురు చూస్తున్నారు. ఈమేరకు పలువురు కౌన్సిలర్లు శనివారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను కలువగా త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెపినట్టు తెలిసింది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తొలుత 17 మంది కౌన్సిలర్లు సంతకాలు చేయగా తాజాగా మరో ముగ్గురు కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసినట్టు తెలిసింది. మొదటి నోటీసులో సంతకాలు చేసిన ముగ్గురు కౌన్సిలర్లు తాము వెనక్కి తగ్గుతున్నట్టు మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖను అందజేయగా, ఆ లేఖ చెల్లుబాటు కాదని కమిషనర్‌ తెలిపారు. మొదట్లో అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసిన కౌన్సిలర్లు షేక్‌సాబేర్‌, వెంకటరాజ్‌, మాఽధురి తాము తప్పుకుంటున్నట్టు కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌లకు లేఖలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే అవిశ్వాస నోటీసుపై చేసిన కౌన్సిలర్ల సంతకాలను 2019లో గెలిచి ప్రమాణ స్వీకార సమయంలో రిజిష్టర్‌లో చేసిన సంతకాలను మున్సిపల్‌ అధికారులు పోల్చి చూడగా సరిగ్గానే ఉన్నాయని నిర్ధారించినట్టు తెలిసింది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవిపై అదే పార్టీకి చెందిన వైస్‌ చైర్‌పర్సన్‌ శంకరి లతా విజయేందర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న నక్క మంజులతా నాగరాజుగౌడ్‌తో పాటు మొత్తం 20మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు.అవిశ్వాసం నెగ్గాలంటే 26 మంది కౌన్సిలర్ల మద్దతు అవసం కాగా మిగిలిన కౌన్సిలర్ల సాయం కోసం మంజులతా నాగరాజుగౌడ్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Feb 17 , 2024 | 11:59 PM