ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:23 PM
కొల్చారం/నర్సాపూర్/రాయికోడ్/జహీరాబాద్/కొండాపూర్/రామాయంపేట, మార్చి 6: ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధించాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.

కొల్చారం/నర్సాపూర్/రాయికోడ్/జహీరాబాద్/కొండాపూర్/రామాయంపేట, మార్చి 6: ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధించాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మండల కేంద్రమైన కొల్చారం రైతువేదిక నుంచి జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ రాహుల్‌రాజుకు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రైతువేదికలో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహ్మద్ గఫర్ మియా, ఎంపీడీవో లక్ష్మీ నర్సింహులు, ఎంపీపీ మంజులూ కాశీనాథ్, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతువేదికల్లో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏర్పాటుచేసిన రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అందులో నర్సాపూర్, కొల్చారం కూడా ఉండడంతో ప్రారంభోత్సవంలో పలువురు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్ మాట్లాడారు. రాయికోడ్ డివిజన్ పరిధిలోని వట్‌పల్లి, మునిపల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన రైతులు రైతునేస్తంలో పాల్గొన్నారు. ఎంపీపీ అధ్యక్షుడు సిర్గాపూర్ మొగులప్ప, పీఏసీఎస్ చైర్మన్‌నాగ్ శెట్టిపాటిల్, పాల్గొన్నారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలోని రైతువేదికలో రైతునేస్తంలో పాల్గొని సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. కొండాపూర్ రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రైతులు సీఎం ప్రసంగించిన అంశాలను శ్రద్ధగా విన్నారు. రైతునేస్తం కార్యక్రమాన్ని రామాయంపేట పట్టణంలోని రైతువేదికలో రైతులు వీక్షించారు.