Share News

పాతపంటల వినియోగంతోనే ఆరోగ్యం: డీడీఎస్‌

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:41 PM

ఝరాసంగం, ఫిబ్రవరి 2: పాతపంటల వినియోగంతోనే అందరం ఆరోగ్యంగా ఉంటామని డీడీఎస్‌ జాతర కోఆర్డినేటర్‌ వినయ్‌కుమార్‌, డీడీఎస్‌ మహిళా రైతులు మొగులమ్మ, గ్రామపెద్దలు పేర్కొన్నారు.

పాతపంటల వినియోగంతోనే ఆరోగ్యం: డీడీఎస్‌
పొట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన జాతరలో పాల్గొని మాట్లాడుతున్న డీడీఎస్‌ మహిళా రైతు మొగులమ్మ

ఝరాసంగం, ఫిబ్రవరి 2: పాతపంటల వినియోగంతోనే అందరం ఆరోగ్యంగా ఉంటామని డీడీఎస్‌ జాతర కోఆర్డినేటర్‌ వినయ్‌కుమార్‌, డీడీఎస్‌ మహిళా రైతులు మొగులమ్మ, గ్రామపెద్దలు పేర్కొన్నారు. డీడీఎస్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న 24వ పాత పంటల జాతర శుక్రవారం మండలంలోని పొట్టిపల్లి గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ చిరుధాన్యాలు క్రమేపీ గ్రామాల్లో కనుమరుగవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. దీంతో 24 ఏళ్లుగా చిరుధాన్యాలను వినియోగించాలని, పంటలను పండించాలని కోరుతూ జహీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రజలను, రైతులను చైతన్యం చేస్తున్నామన్నారు. చిరుధాన్యాలను ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే పోషకాలు లభించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రామంలో చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్థులు రాందాస్‌, మాణిక్‌పాటిల్‌, శివప్రసాద్‌, మల్లికార్జున్‌, బాల్‌రాజ్‌, డీడీఎస్‌ మహిళా రైతులు, జాతర నిర్వాహకులు వినయ్‌కుమార్‌, మంజుల, పూలమ్మ, విజయలక్ష్మి, లక్ష్మమ్మ, చంద్రమ్మ, కమలమ్మ, జనరల్‌ నర్సమ్మ, మొగులమ్మ, బాలయ్య, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:55 PM