కాంగ్రెస్ గెలుపుతో మార్పునకు నాంది
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:54 PM
నారాయణఖేడ్, జూన్ 7: కాంగ్రెస్ గెలుపు మార్పునకు నాంది పలికిందని, కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేస్తామని జహీరాబాద్ ఎంపీ సురే్‌షకుమార్ షెట్కార్ అన్నారు.

కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషిచేస్తాం
జహీరాబాద్ ఎంపీ సురే్‌షషెట్కార్
నారాయణఖేడ్, జూన్ 7: కాంగ్రెస్ గెలుపు మార్పునకు నాంది పలికిందని, కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేస్తామని జహీరాబాద్ ఎంపీ సురే్‌షకుమార్ షెట్కార్ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్‌పేట నుంచి కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా ప్రణాళిక మండలి మాజీ సభ్యుడు నగే్‌షషెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు కర్నె.శ్రీనివాస్, శంకరయ్యస్వామి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకే్‌షషెట్కార్, సురే్‌షషెట్కార్ కూతుళ్లు గిరిజాషెట్కార్, శివానీషెట్కార్, సాగర్ షెట్కార్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు రషీద్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీఎత్తున బాణసంచా కాల్చారు. ర్యాలీలో అడుగడుగునా కాంగ్రెస్ అభిమానులు సురే్‌షషెట్కార్‌ను, సంజీవరెడ్డిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాజీవ్ చౌక్ వద్ద క్రేన్ సహాయంతో గజమాల వేశారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద సురే్‌షకుమార్ షెట్కార్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీఆర్‌ఎస్ గాలిలో గెలిచిన బీబీపాటిల్, అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ ఓడిపోతుందని తెలిసి బీజేపీలో చేరి పోటీ చేశారన్నారు. బీజేపీ నాయకులు దేవుడిని రాజకీయాల్లోకి తెచ్చి మతం పేరిట కుట్రలు పన్ని యువతను చెడగొడుతున్నారని పేర్కొన్నారు. తాను చేసిన త్యాగాన్ని ఢిల్లీ నుంచి ఇక్కడి సాధారణ కార్యకర్త వరకు గుర్తించి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రె్‌సను గెలిపించి బీజేపీకి బుద్ధి చెప్పారన్నారు. దశాబ్దకాలంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారని, తాను కాంగ్రెస్ భవిష్యత్తు, కార్యకర్తలు బాగుండాలనే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తాను ఎంపీగా, సంజీవరెడ్డి ఎమ్మెల్యేగా అభివృద్ధి కోసం శ్రమిస్తామన్నారు. పరిశ్రమలను, విద్యాసంస్థలను ఏర్పాటు చేసి గ్రామాలు, తండాలకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలకు వనవాసం తప్పలేదన్నారు. తనను ఎమ్మెల్యేగా, సురేష్ షెట్కార్‌ను ఎంపీగా గెలిపించి సీఎం రేవంత్‌రెడ్డికి డబుల్ ధమాక ఇచ్చిన ఘనత నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలదే అని చెప్పారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించి 2009 ఫలితాలను పునరావృతం చేశారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వెల్లడించారు. అంతకుముందు సురే్‌షషెట్కార్, సంజీవరెడ్డిలు మంగల్‌పేట దుర్గామాత ఆలయానికి చేరుకోగానే కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో బోరంచకు చెందిన గుర్రపు కళాకారుల నృత్యం ఆకట్టుకుంది.