Share News

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు

ABN , Publish Date - May 30 , 2024 | 11:22 PM

పెద్దశంకరంపేట, మే 30: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మెదక్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు
వీరోజిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలను తెలుసుకుంటున్న వెంకటేశ్వర్లు

మెదక్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

పెద్దశంకరంపేట, మే 30: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మెదక్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పెద్దశంకరంపేట మండల పరిధిలోని వీరోజిపల్లి, జూకల్‌ తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో లలసత్వం వహించరాదని అధికారులకు సూచించారు. పెద్దశంకరంపేట మండలంలో ధాన్యం తరలించడంలో నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్‌ గ్రేస్‌బాయ్‌, పీఏసీఎస్‌ సీఈవో రవీందర్‌, అధికారులపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించాలని ఆన్‌లోడింగ్‌ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి లారీలను తిరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పేట తహసీల్దార్‌ గ్రేస్‌బాయ్‌, సిబ్బంది రైతులు తదితరులు ఉన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:22 PM