రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:07 PM
గజ్వేల్/కుకునూరుపల్లి/దుబ్బాక/చేర్యాల, జూలై 8: రైతులకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకుల డిమాండ్ చేశారు.

బీజేపీ కిసాన్‌మోర్చా నాయకుల డిమాండ్
గజ్వేల్/కుకునూరుపల్లి/దుబ్బాక/చేర్యాల, జూలై 8: రైతులకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకుల డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తుగారి తిరుమల్‌రెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా గజ్వేల్ పట్టణ, మండల అధ్యక్షులు సంగెం కరుణాకర్, పంజా బాలుతో కలిసి సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మార్కంటి ఏగొండ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆరు మాసాలు గడుస్తున్నా నెరవేర్చలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని, రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. వారితో బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ కో-కన్వీనర్లు ఎలుకంటి సురేష్, మహేష్, ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నత్తి శివకుమార్, గజ్వేల్ పట్టణ, మండలాధ్యక్షులు మనోహర్‌యాదవ్, పంజాల అశోక్ తదితరులున్నారు. కుకునూరుపల్లిలో బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, మండలాధ్యక్షుడు గుర్రాల స్వామి, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. దుబ్బాకలో బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పంట రుణమాఫీ రూ.2 లక్షలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మోర్చా కొమురవెల్లి మండల నాయకులు సోమవారం కొమురవెల్లి తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు బచ్చల చంద్రం, నరెడ్ల నరేందర్‌రెడ్డి, గురాల్ర రాములు పాల్గొన్నారు.