Share News

గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:05 AM

సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్‌

గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి
చేగుంటలో సమ్మె కరపత్రాలు విడుదల చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు

చిన్నశంకరంపేట/చేగుంట, ఫిబ్రవరి 6: గ్రామ పంచాయతీ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్‌ చేశారు. మంగళవారం పంచాయతీ సిబ్బంది సమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీశైలానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో వెట్టిచాకిరి చేస్తున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితులు అయోమయంగా ఉన్నాయన్నారు. పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేసి మల్టీపర్పస్‌ విధానాన్ని ఎత్తి వేయాలని కోరారు. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది సిద్ధిరాములు, బాబు, మల్లేశం, దుర్గయ్య, యాదయ్య, ఎల్లయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు. అలాగే చేగుంటలో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా ఉపాఽధ్యక్షురాలు యాదమ్మ, పద్మ, లావణ్య, నవనీత పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:05 AM