Share News

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:47 PM

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఘన్‌పూర్‌లో రూ.4.50కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన పాఠశాల ప్రారంభం

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ఘన్‌పూర్‌లో పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

పటాన్‌చెరు, జనవరి 18: కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఘన్‌పూర్‌లో గ్లాండ్‌ ఫార్మా పరిశ్రమ సీఎ్‌సఆర్‌ నిధులు రూ.4.50కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేజీ టూ పీజీ విద్యావిధానంతో పేదలకు ఎంతో ఉపయోగం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా గ్లాండ్‌ పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు. త్వరలోనే నియోజకవర్గంలోని 7,000 మంది పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజ, ఎంపీపీ సుష్మశ్రీ, సర్పంచ్‌ కావ్యరెడ్డి, గ్లాండ్‌ ఫార్మా సీఎ్‌సఆర్‌ మేనేజర్‌ రఘురామన్‌, ఎంపీటీసీ నీనారెడ్డి, ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, మాజీ సర్పంచ్‌ విఠలయ్య, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వర్‌నాయక్‌, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, కాశిరెడ్డి, వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:47 PM