Share News

రంగనాయకసాగర్‌లోకి గోదారమ్మ పరవళ్లు

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:52 PM

జిల్లాలోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి.

రంగనాయకసాగర్‌లోకి గోదారమ్మ పరవళ్లు
రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్న పంపు

చిన్నకోడూరు, జనవరి 18 జిల్లాలోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టులోకి గురువారం ఒక పంపు ద్వారా నీటి ఎత్తిపోతను నీటిపారుదలశాఖ అధికారులు ప్రారంభించారు. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ఇప్పటికే ప్రాజెక్టులో 1.5 టీఏంసీల నీరు నిల్వ ఉందని, ఈనెల 20 వరకు మూడు రోజుల్లో ఒక టీఏంసీ నీటిని ప్రాజెక్టులోకి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - Jan 18 , 2024 | 11:52 PM