Share News

డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌కు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:37 PM

రాయపోల్‌, ఏప్రిల్‌ 14: అక్రమార్కులు పేదల గ్యాస్‌ సిలిండర్లను కూడా వదలడం లేదు. కొన్ని సిలిండర్ల నుంచి రెండు, మూడుకిలోల గ్యాస్‌ను, మరికొన్ని సిలిండర్లను పూర్తిగా కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్‌ చేస్తూ పేదలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ క్రమంలో రాయపోల్‌లోని భారత్‌ గ్యాస్‌గోదాం నిర్వాహకుల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.

డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌కు..
రాయపోల్‌ భారత్‌ గ్యాస్‌ గోదాంలో డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్‌ చేస్తున్న దృశ్యం

రాయపోల్‌ భార త్‌ గ్యాస్‌ గోదాంలో కుంభకోణం

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

రాయపోల్‌, ఏప్రిల్‌ 14: అక్రమార్కులు పేదల గ్యాస్‌ సిలిండర్లను కూడా వదలడం లేదు. కొన్ని సిలిండర్ల నుంచి రెండు, మూడుకిలోల గ్యాస్‌ను, మరికొన్ని సిలిండర్లను పూర్తిగా కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్‌ చేస్తూ పేదలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ క్రమంలో రాయపోల్‌లోని భారత్‌ గ్యాస్‌గోదాం నిర్వాహకుల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. రాయపోల్‌ మండల కేంద్రంలో సుమారు రెండేళ్ల క్రితం భారత్‌ డొమెస్టిక్‌ గ్యాస్‌ గోదాం మంజూరైంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు మండలంలోని ఆయా గ్రామాల గృహ వినియోగదారులకు సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాయపోల్‌లోని అభివర్షన్‌ భారత్‌ గ్యాస్‌ గోదాం నిర్వాహకులు అక్రమాలకు తెర లేపారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో డొమెస్టిక్‌ సిలిండర్లలోని గ్యాస్‌ను రెండు, మూడు కిలోలు, ఒక్కో సిలిండర్‌ను పూర్తిగా కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్‌ చేస్తూ హైదరాబాద్‌లోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఆదివారం సాయంత్రం గోదాంపై ఆకస్మిక దాడిచేయగా డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి కమర్షియల్‌ సిలిండర్లలోకి గ్యాస్‌ను డంపు చేస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిలిండర్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.

Updated Date - Apr 14 , 2024 | 11:37 PM