అక్కడ అవిశ్వాసం.. ఇక్కడ చీలిక!
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:50 PM
జిన్నారం మండలంలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్నది. కాంగ్రె్‌సకు చెందిన ఎంపీపీపై బీఆర్‌ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా.. బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎ్‌సకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు.
జిన్నారంలో ఎంపీపీపై బీఆర్‌ఎస్ గురి.. బొల్లారంలో కారు దిగిన కౌన్సిలర్లు
మండలంలో వేడెక్కిన రాజకీయాలు
జిన్నారం, ఫిబ్రవరి 6: జిన్నారం మండలంలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్నది. కాంగ్రె్‌సకు చెందిన ఎంపీపీపై బీఆర్‌ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా.. బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎ్‌సకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు.
బీఆర్‌ఎస్‌కే బలం
జిన్నారం మండల పరిషత్ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్ (కాంగ్రె్‌స)పై బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 5 మంది ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటిస్తూ ఆర్డీవోకు నోటీసులు ఇచ్చారు. మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. దీంతో మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి లాటరీ తీయగా కాంగ్రె్‌సకు ఎంపీపీ పీఠం దక్కింది. అనంతరం కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీటీసీలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. అదే సమయంలో బీఆర్‌్‌సకు చెందిన ఒకరు కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ వైపు ఐదుగురు, కాంగ్రె్‌సకు ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో అవిశ్వాస సమావేశం నిర్వహిస్తే బీఆర్‌ఎ్‌సకే సంఖ్యా బలం ఉన్నది.
కాంగ్రెస్ గూటికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
మండలంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ అయిన బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎ్‌సకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరారు. ఇక్కడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎ్‌సకు చెందిన రోజారాణి బాల్‌రెడ్డి ఉన్నారు. ఆ పార్టీకి ఇంకా 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
ఆది నుంచి అసంతృప్తి
బీఆర్‌ఎ్‌సకు చెందిన సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ చంద్రారెడ్డి వర్గానికి, చైర్‌పర్సన్ వర్గానికి మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉండేది. నిధుల కేటాయింపులో, పార్టీలో కార్యక్రమాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని చంద్రారెడ్డి వర్గం అసంతృప్తితో ఉన్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులపై నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని 5వ తేదీన జరిగిన మున్సిపల్ సమావేశాన్ని వారు బహిష్కరించారు. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆరుగురు కౌన్సిలర్లు మంగళవారం కాంగ్రె్‌సలో చేరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చంద్రారెడ్డి, నిహారికరెడ్డి, చంద్రయ్య, గోపాలమ్మ, రాధ, జయమ్మ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివా్‌సగౌడ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి, కౌన్సిలర్లు మాట్లాడుతూ బీఆర్‌ఎ్‌సలో సామాజిక న్యాయం లేదని, కష్టపడి పనిచేసినవారికి తగిన గుర్తింపు దక్కడం లేదని విమర్శించారు. బొల్లారం మున్సిపాలిటీలో నియంతృత్వ పోరాటం చేస్తామని అన్నారు. అంతకుముందు బొల్లారం నుంచి చంద్రారెడ్డి, ఆయన అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ తరలివెళ్లారు. వారి వెంట నాయకులు జైపాల్‌రెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రాజ్‌గోపాల్, శ్రీకాంత్‌రెడ్డి, బషీర్ తదితరులు ఉన్నారు.