Share News

కాంగ్రె్‌సతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:25 PM

వట్‌పల్లి, మార్చి 9: ప్రజలకు మౌలిక సదుపాయాలు, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

కాంగ్రె్‌సతోనే అభివృద్ధి సాధ్యం
వట్‌పల్లిలో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి రాజనర్సింహ

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

వట్‌పల్లి, మార్చి 9: ప్రజలకు మౌలిక సదుపాయాలు, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం వట్‌పల్లిలో రూ.11.20 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.2.60 సీసీరోడ్డు నిర్మాణం, గౌతాపూర్‌ నుంచి గొర్రెకల్‌ గ్రామం వరకు రూ.1.30 కోట్లతో ఫార్మేషన్‌ రోడ్డు నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వట్‌పల్లిలో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి వినయ్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రమే్‌షజ్యోషి, ఎంపీపీ పత్రి కృష్ణవేణి, జడ్పీటీసీ పత్రి అపర్ణ, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

వెంకటఖ్వాజా ఉర్సులో మంత్రి

వట్‌పల్లిలోని వెంకటఖ్వాజా 39వ ఉర్సు శనివారం అట్టహాసంగా ఇందులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి సురే్‌షషెట్కార్‌ హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంధం తలపై పెట్టుకుని ఆశ్రమంలోని దర్గాకు తీసుకెళ్లగా ఆవ్రమ ట్రస్టు సభ్యులు వీరికి ఘనస్వాగతం పలికారు.

Updated Date - Mar 09 , 2024 | 11:25 PM