Share News

అమీన్‌పూర్‌లో వసతుల కల్పనకు పెద్దపీట

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:30 PM

కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి

అమీన్‌పూర్‌లో వసతుల కల్పనకు పెద్దపీట
మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి

పటాన్‌చెరు రూరల్‌, జనవరి 5: మున్సిపల్‌ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.98కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, బడ్జెట్‌ కేటాయింపులపై సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. వేగంగా జనావాసాలు విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత మున్సిపాలిటీపై ఉన్నదని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, వీధిదీపాలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. కాలనీలకు ధీటుగా వీకర్‌సెక్షన్‌ కాలనీలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మున్సిపల్‌ సిబ్బంది, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తల్తెకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ ట్యాంకులు, పైపులైన్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చైర్మన్‌ వెల్లడించారు. ఆయా వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో నిధుల కొరత లేదని, ప్రాధాన్య క్రమంలో అన్ని పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, కమిషనర్‌ జ్యోతిరెడ్డి, ఏఈ ప్రవీన్‌, మేనేజర్‌ మోహన్‌, ఆర్వో వెంకటరామయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అంజన్‌, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఏఈ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:30 PM