Share News

మాట తప్పడమే కాంగ్రెస్‌ నైజం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:25 PM

సంగారెడ్డి రూరల్‌, మార్చి 6: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను ఎన్నికల తరువాత మాట తప్పడమే కాంగ్రెస్‌ నైజమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు.

మాట తప్పడమే కాంగ్రెస్‌ నైజం: ఎమ్మెల్యే
ధర్నా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

సంగారెడ్డి రూరల్‌, మార్చి 6: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను ఎన్నికల తరువాత మాట తప్పడమే కాంగ్రెస్‌ నైజమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ఆ పార్టీ నేతలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజల నుంచి రూ.20 కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్‌ తెరలేపిందని విమర్శించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మెదక్‌ మున్సిపాలిటీ: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కొండంత హామీలిచ్చి.. ఇప్పుడు గోరంత కూడా అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్‌ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యారెడ్డి, ఎంపీపీ యమున, మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌: లేఅవుట్లు, లేఅవుట్లలోని ప్లాట్లను చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా క్రమబద్ధీకరించాలని మాజీ మెఎ్మల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలను వసూలు చేయాలనే ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఖేడ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు పరమేశ్వర్‌, జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్‌నాయక్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రజలపై భారంగా ఉన్నదని, దానిని తొలగించి ఉచితంగానే భూములను క్రమబద్ధీకరించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం ఎల్‌ఆర్‌ఎ్‌సపై నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో సునీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, జడ్పీ కో ఆప్షన్‌ మన్సుర్‌ పాల్గొన్నారు.

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. బుధవారం జహీరాబాద్‌ పట్టణంలో ఎల్‌ఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవోకు రాజుకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Mar 06 , 2024 | 11:25 PM