Share News

బీఆర్‌ఎ్‌సకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:01 PM

మద్దూరు/ధూళిమిట్ట, ఏప్రిల్‌ 2: బీఆర్‌ఎస్‌ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొద్దిరోజుల్లో చంచల్‌గూడ జైల్లో ఉంటారంటూనే.. శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తని బీజేపీ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు.

బీఆర్‌ఎ్‌సకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు
మద్దూరులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీలో చేరినవారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న బూర నర్సయ్యగౌడ్‌

బీజేపీ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ప్రచారం

మద్దూరు/ధూళిమిట్ట, ఏప్రిల్‌ 2: బీఆర్‌ఎస్‌ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొద్దిరోజుల్లో చంచల్‌గూడ జైల్లో ఉంటారంటూనే.. శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తని బీజేపీ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని లద్నూరు, మద్దూరు గ్రామాల్లో కార్యకర్తల వ్యధ ప్రజా తెలంగాణ యాత్రలో భాగంగా పర్యటించారు. మద్దూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు షాపుల యజమానులను కలిసి బీజేపీకి ఓటేయాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీలో చేరిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ మోదీ గళం.. యువత బలం అని, మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మోదీని గెలిపించాలని కోరారు. దేశంలో మోదీ.. భువనగిరిలో బూర ఉండాలన్నారు. కాంగ్రె్‌సది అభయహస్తం కాదని భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు సురే్‌షగౌడ్‌, ప్రచార కన్వీనర్‌ బల్ల శ్రీనివాస్‌, జిల్లా సెక్రటరీ కూరెల్ల రాజుగౌడ్‌, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

తనను ఆశీర్వదిస్తే..

తనను ఆశీర్వదించండి.. బైరాన్‌పల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తానని బీజేపీ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో ఆయన పర్యటించారు. ముందుగా గ్రామంలోని బురుజు వద్ద రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బురుజు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనాటి ఉద్యమకారులను సన్మానించి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత వీరబైరాన్‌పల్లి గ్రామం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవచ్చు అని అనుకున్నాం. కానీ మత రాజకీయాలకు తలొగ్గి కేసీఆర్‌ వీరబైరాన్‌పల్లి చరిత్రను కప్పివేసే ప్రయత్నం చేస్తే... సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిన ఘనత నరేంద్రమోదీకి, బీజేపీకి దక్కుతున్నదన్నారు. అనంతరం తర్వాత దూళిమిట్ట మండల కేంద్రంలో పర్యటించి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి,బీజేపీ దూళిమిట్ట మండలాధ్యక్షుడు సంతోష్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:01 PM