Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:37 PM

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 3: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా మహాత్మాజ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6,7,8వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాల వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 3: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా మహాత్మాజ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6,7,8వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలో 14 కేంద్రాల్లో 3,391 మందికి 3,079 మంది హాజరుకాగా, 312 మంది గైర్హాజరయ్యారు. మెదక్‌ జిల్లాలో 10 కేంద్రాల్లో 2,326 మందికి 2,127 మంది హాజరుకాగా, 199 మంది గైర్హాజరయ్యారు. సిద్దిపేట జిల్లాలో ఆరు కేంద్రాల్లో 1,480 మందికి 1,303 మంది హాజరుకాగా, 177 మంది గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో 7,197 మందికి 6,509 మంది హాజరుకాగా, 688 మంది గైర్హారయ్యారు. సంగారెడ్డిలోని బీసీ బాలికల గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ప్రభాకర్‌ తనిఖీ చేశారు.

Updated Date - Mar 03 , 2024 | 11:37 PM