Share News

రైతుల కష్టాలు పట్టని దివాలాకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:03 PM

సంగారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 2: రైతుల కష్టాలను దివాలకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంగారెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌ అన్నారు.

రైతుల కష్టాలు పట్టని దివాలాకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వం
డీఆర్‌వోకు వినతిపత్రం అందజేస్తున్న చింతా ప్రభాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ

ఎండిన పంటలకు పరిహారం అందించాలి

రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి

సంగారెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 2: రైతుల కష్టాలను దివాలకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంగారెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ అధిష్టానం పిలుపుమేరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావులతో కలిసి కలెక్టరేట్‌ డీఆర్‌వోకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు అన్ని పంటలపై ఎకరాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే 6న కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చింతా ప్రభాకర్‌ హెచ్చరించారు. ఈ కార్యకమ్రంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కుంచాల ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు జైపాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, చిల్వేరి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

మెదక్‌ మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 2: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయలేకపోయిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు ధాన్యం కొనుగోలుపై ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Apr 02 , 2024 | 11:03 PM