Share News

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:39 PM

అర్హులైన ప్రతీ ఒక్కరు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
కంగ్టిలో 2కే రన్‌ను ప్రారంభిస్తున్న అధికారులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, జనవరి 17: అర్హులైన ప్రతీ ఒక్కరు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం ఓటరు నమోదుపై సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు పట్టణాలల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ నెల 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు కూడా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jan 17 , 2024 | 11:39 PM