Share News

చక్రియాల్‌ను సందర్శించిన జపాన్‌ బృందం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:27 PM

పుల్‌కల్‌, ఫిబ్రవరి 27: చౌటకూర్‌ మండలం చక్రియాల గ్రామాన్ని ఐఐటీ కంది వారి సౌజన్యంతో జపాన్‌ బృందం మంగళవారం సందర్శించింది.

చక్రియాల్‌ను సందర్శించిన జపాన్‌ బృందం
చక్రియాల్‌లో పర్యటిస్తున్న జపాన్‌ బృందం

వ్యవసాయ రంగంపై అధ్యయనం

పుల్‌కల్‌, ఫిబ్రవరి 27: చౌటకూర్‌ మండలం చక్రియాల గ్రామాన్ని ఐఐటీ కంది వారి సౌజన్యంతో జపాన్‌ బృందం మంగళవారం సందర్శించింది. గ్రామంలో వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు, సేద్యంలో తలెత్తుతున్న ఇబ్బందులు, పంటల దిగుబడులు, మార్కెటింగ్‌ తదితర అంశాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి సేద్యానికి వినియోగిస్తున్న పరికరాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో సుజూకీ కంపెనీకి చెందిన రమ, వుకీ, కియా మాథ్యూ, లియోక్త, అకిర, కిరోకి, సతోరాలు ఉన్నారు. వీరి వెంట మండల వ్యవసాయ అధికారి చైతన్య, ఏఈవో మనిషా, రైతులు గాజుల సుభా్‌షబాబు, రోళ్లపాటి మల్లేశం, మన్నె నర్సింహులు, తుంగె మల్లేశం ఉన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:27 PM