పేదల హృదయాల్లో వైఎస్సార్‌ది చెరగని ముద్ర
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:03 PM
పేద ప్రజల హృద యాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్ర వేసు కున్నారని, అందుకే చనిపోయి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- జిల్లాలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి
మహబూబ్‌నగర్, జూలై 8 : పేద ప్రజల హృద యాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్ర వేసు కున్నారని, అందుకే చనిపోయి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ య్యారన్నారు. సోమవారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారని, జలయజ్ఞం పేరుతో జిల్లాలో నాలుగు ప్రాజెక్ట్‌లు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మై నారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు వినోద్‌కుమార్, సత్తూరు చం ద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రి, బెక్కరి అనిత, సీజే.బె నహర్, రాములుయాదవ్, పీర్‌మహ్మద్‌సాదిక్, లక్ష్మణ్‌యాదవ్, అజ్మత్‌అలీ తదితరులున్నారు.
- దేవరకద్ర : మండల కేంద్రంలోని పాత బ స్టాండ్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం వైఎస్సార్ చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
- జడ్చర్ల : పట్టణంలోని క్రాస్‌రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాదిమి శివకుమార్, కాం గ్రెస్ పార్టీ నాయకులు నిత్యానందం, బాదిమి రవి శంకర్, అశోక్‌యాదవ్, మాలిక్ షాకీర్, బుర్లవెంక టయ్య, బుక్కవెంకటేశ్, మినాజ్, కాట్రేపల్లి లక్ష్మ య్య, ఎర్ర ఆనంద్, చైతన్యచౌహాన్, కుమ్మరిరాజు, రమేశ్ తదితరులున్నారు.
- రాజాపూర్ : మండల కేంద్రంలోని ముఖ్య కూడలి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్ చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో యాద య్య, కృష్ణయ్య, గోవర్ధన్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, గోనెల రమేష్, విక్రమ్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, నజీర్‌బైగ్, హీర్‌నాయక్, మోహన్‌నాయక్, శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- గండీడ్ : మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ పా ర్టీ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ ఆర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బాలయ్య, వర్కింగ్ ప్రెసిడెం ట్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌రావు, కొటాల చిన్నయ్య, పులిందర్‌రెడ్డి, భీమయ్య, మోహన్, వెం కటయ్య, దస్తయ్య తదితరులున్నారు.
- నవాబ్‌పేట : మండలంలోని గురుకుంట గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నా యకుడు బంగ్ల రవి పూలమాలలు వేసి నివాళ్లు అ ర్పించారు. నాయకులు బోవొళ్ల రాజశేఖర్, కోట్ల రాజు, శ్రీహరి, సత్యం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
- చిన్నచింతకుంట : మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, వజీర్‌బాబు, జహంగీర్, జయరాజు, ప్రతాప్ తదితరులున్నారు.