ఆదర్శ ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:57 PM
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అవిశ్రాంత కృషి చేసిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని టీపీసీసీ ప్రతినిధి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ డి. శంకర్ కొనియాడారు.

- టీపీసీసీ ప్రతినిధి శంకర్ నివాళి
- వైఎస్సార్‌కు నివాళి అర్పించిన నాయకులు
గద్వాల టౌన్/ గట్టు, జూలై 8 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అవిశ్రాంత కృషి చేసిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని టీపీసీసీ ప్రతినిధి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ డి. శంకర్ కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, దివంగత వైఎస్సార్ జయంతిని పురస్క రించుకుని కాంగ్రెస్ నాయకులు సోమవారం పట్ట ణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లోని ఆయన విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్‌ఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటైన జలయజ్ఞం ద్వారా నెట్టెంపాడు రాకతో గద్వాల జిల్లా సస్యశ్యామలమైందని గుర్తుచేశారు. నిరుపేద విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత విద్య కలను సాకారం చేసిన ఆయన, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరైట్ వైద్య సేవలు అందించిన ఘనత దక్కించుకున్నారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, మునిసిపల్ వైస్ చైర్మన్ ఎండీ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, మాజీ చైర్మన్ జి.వేణు గోపాల్, మార్కెట్ కమటీ మాజీ చైర్మన్ లత్తిపురం వెంకట్రామి రెడ్డి, నాయకులు షేక్‌జమాల్, కౌసర్‌బేగ్, కోటేష్, నందు, షుకూర్, సత్యం, కురుమన్న, ఇలి యాస్, ధర్మనాయుడు, రిజ్వాన్ పాల్గొన్నారు.
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జయంతిని గట్టు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్ పాషా, బ్లాక్ అధ్యక్షుడు ఎండీ గౌస్, అప్కో మాజీ డైరక్టర్ వీరన్న, చాగదోణ బుడ్డప్ప పాల్గొన్నారు.