Share News

యువత దైవమార్గంలో నడవాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:31 PM

యువత పాశ్చత్య పోకడలను వీడి దైవమార్గంలో పయనించాలని స్వర లహరి కల్చరల్‌ అకాడమీ అధ్యక్షుడు ఎన్‌ భాగన్నగౌడ్‌ పిలుపునిచ్చారు.

యువత దైవమార్గంలో నడవాలి
మన్యంకొండకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : యువత పాశ్చత్య పోకడలను వీడి దైవమార్గంలో పయనించాలని స్వర లహరి కల్చరల్‌ అకాడమీ అధ్యక్షుడు ఎన్‌ భాగన్నగౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్వర లహరి కల్చరల్‌ అకాడమీ, ధర్మ వాహిని పరిషత్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా ‘పదరా పోదాం మన్యంకొండ’కు రెండో పాదయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ పాదయాత్ర వన్‌టౌన్‌ చౌరస్తా మీదుగా, హనుమాన్‌పుర, బండమీదిపల్లి, రాజీవ్‌ గృహకల్ప మీదుగా మన్యంకొండకు బయలు దేరారు. హనుమాన్‌పుర వద్ద కాలనీ ప్రజలు పాదయాత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండమీదిపల్లి శివాజీ విగ్రహం వద్ద పూలమాల వేసి, మాట్లాడారు. తీరుతే తిరుపతి, లేకుంటే మన్యంకొండకు వెళ్లాలని పెద్దలు అనే వారని.. అంతటి ప్రసిద్ధ ఆలయమైన మన్యంకొండ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం మనకు సమీపంలో ఉండటం అదృష్టం అన్నారు. నడవలేని వారు నేరుగా అలివేలు మంగమ్మ ప్రాంగణానికి చేరుకుంటారని, అక్కడ నుంచి అందరు స్వామి వారిని దర్శించుకుని తిరిగి వాహనాల్లో పాలమూరుకు చేరుకుంటామన్నారు. పాదయాత్రకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ శ్రీనయ్య సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు. పాదయాత్రలో జోషి సంతోషాచారి, మేకల శ్రీనివాస్‌, కనికే శ్రీనివాస్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:31 PM