Share News

భక్తిశ్రద్ధలతో తుల్జాభవాని పూజలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:11 PM

మండలంలోని కర్నెతండా లో బుధవారం భక్తిశ్రద్ధలతో తుల్జా భవాని అమ్మవారి ఉత్సవాలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో తుల్జాభవాని పూజలు
కర్నెతండాలో గిరిజనుల ఆరాధ్య దైవం తుల్జా భవాని

ఖిల్లాఘణపురం, జనవరి 17: మండలంలోని కర్నెతండా లో బుధవారం భక్తిశ్రద్ధలతో తుల్జా భవాని అమ్మవారి ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతీ ఇంటి ముందు ధాన్యపు బస్తాలను ప్రత్యేకంగా అలంకరించి తుల్జా భవాని అమ్మ వారి రూపంగా భావించే వెండి వస్తువులకు పూజలు చేస్తూ మంగళవారం రాత్రి జాగరణ చేశారు. అమ్మ వారికి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో అమ్మ వారి పండుగ చేస్తామని తండావాసులు తెలిపారు. గిరిజనులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతూ ఈ పండుగకు గ్రామాలకు చేరుకోవడం, తండాలోని ప్రతీ ఇల్లు మిరమిట్లు గొలిపే విధంగా ప్రత్యేకంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. దీంతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది. తండాలలోని ప్రతీ కుటుంబానికి సంబంధించి బంధుమిత్రులను ఆహ్వానించడం, డీజే పాటలకు నృత్యాలు చేయడంతో తండాలలో పండుగ కళ వచ్చేసింది.

Updated Date - Jan 17 , 2024 | 11:11 PM