Share News

ట్యూబ్‌లైట్‌ తయారీపై విద్యార్థులకు వర్క్‌షాప్‌

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:02 PM

మండలంలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి 8, 9వ తరగతి విద్యార్థులకు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్‌ తయారీ, వర్మికంపోస్ట్‌ ఎరువుల తయారీపై ఒక్క రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు.

ట్యూబ్‌లైట్‌ తయారీపై విద్యార్థులకు వర్క్‌షాప్‌
ట్యూబ్‌లైట్‌ తయారు చేసిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

నారాయణపేట రూరల్‌, సెప్టెంబరు 21 : మండలంలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి 8, 9వ తరగతి విద్యార్థులకు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్‌ తయారీ, వర్మికంపోస్ట్‌ ఎరువుల తయారీపై ఒక్క రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ, జాతీయ హరితదళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్‌ అధికారి రాజశేఖర్‌, ఇన్‌చార్జి అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి రాంచంద్రాచారి, సెక్టోరియల్‌ అధికారులు శ్రీనివాస్‌, నాగార్జునరెడ్డి, మొబైలింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎం భారతి మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌ ద్వారా విద్యార్థుల మేధస్సును పదును పెట్టడం జరుగుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో 36 పాఠశాలల నుంచి 140 మంది విద్యార్థులు, 36 మంది గైడ్‌ ఉపాధ్యాయులు హాజరయ్యారు. అనంతరం ధ్రువపత్రాలు అందజేశారు. భానుప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:02 PM