Share News

త్వరగా పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 30 , 2024 | 10:50 PM

అమ్మ ఆదర్శ కమిటీ’ ఆధ్వర్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ అన్నారు.

త్వరగా పనులు పూర్తి చేయాలి
వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

- అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

- పాఠశాలలో కొనసాగుతున్న పనుల పరిశీలన

మక్తల్‌ రూరల్‌, మే 30 : ‘అమ్మ ఆదర్శ కమిటీ’ ఆధ్వర్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ అన్నారు. గురువారం మండలంలోని కాచ్‌వార్‌, వనాయకుంట గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభయ్యే నాటికి నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఇంకుడు గుంతల్లోకి నీరు చేరేలా చర్యలు తీసుకోఆలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవిందరావు, ఎంపీవో రహమత్‌ పాల్గొన్నారు.

డీఆర్‌డీఏ కార్యాలయం తనిఖీ

నారాయణపేట టౌన్‌ : జిల్లా కేంద్రం సమీపంలోని డీఆర్‌డీఏ కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ గురువారం ఆకస్మికంగా తనికీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ కేంద్రంలో కొనసాగుతున్న స్కూల్‌ యూనిఫాం స్టిచ్చింగ్‌ను పరిశీలించారు. అంతకుముందు ఐదవ వార్డులోని కమ్యూనిటీ భవనంలో పట్టణ మహిళా సంఘం సభ్యులు కుడుతున్న స్కూల్‌ యూనిఫాంలను పరిశీలించి, పాఠశాలలు పునర్‌ ప్రారంభమయ్యే వరకు యూనిఫాంలు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ రాజేశ్వరి, అడిషనల్‌ డీఆర్డీఏ అంజయ్య, మునిసిపల్‌ కమిషనర్‌ సునీత పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 10:50 PM