నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:02 PM
అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల్లోని ప్రజల సహకారంతో అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ఎర్రవల్లి, ఫిబ్రవరి 6 : అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల్లోని ప్రజల సహకారంతో అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో భవన్‌లో ఎంపీపీ స్నేహ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా వివిధ శాఖల అధికారులు నివేదికలను సమర్పించారు. అనంతరం సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను సభ దృష్టికి తెచ్చారు. వచ్చే సమావేశంలోపు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధికారులకు సూచించారు. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఎమ్మెల్యే విజయుడు, ఎంపీపీ స్నేహ, జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రామనర్సింహ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయనను సత్కరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కొండేరు ఈశ్వర్ కుటుంబ సభ్యులకు పార్టీ సభ్యత్వం ద్వారా రెండు లక్షల రూపాయల బీమా చెక్కును అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు రంగారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో రాఘవ, సూపరింటెండెంట్ రమాదేవి, ఏవో అయూబ్, ఏపీఎం శోభారాణి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు జోగులరవి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.