Share News

ఆర్డీవో కార్యాలయం ముందు మహిళ నిరసన

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:31 PM

దాయాదుల నుంచి తమ భూమిని ఇప్పించాలని కోరుతూ వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెం దిన జయప్రదరెడ్డి అనే మహిళ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఆర్డీవో కార్యాలయం ముందు మహిళ నిరసన
ఆర్డీవో కార్యాలయం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న జయప్రదరెడ్డి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూన్‌ 12 : దాయాదుల నుంచి తమ భూమిని ఇప్పించాలని కోరుతూ వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెం దిన జయప్రదరెడ్డి అనే మహిళ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది. తన భర్త సీమర్ల ప్రతా పరెడ్డి మరణించాక భూములు తనకు, మరిదికి సమానంగా వచ్చాయన్నారు. 2021, 2022లో తన మరిది, స్థానిక తహసీల్దార్‌ సహకారంతో మూడో వ్యక్తి పేరున తనకు చెందిన భూమిని రిజిస్ర్టేషన్‌ చేసినట్లు తెలిపారు. 23 ఎకరాల 11 గుంటలు ఉన్న తన భూమిని అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేసుకుని ఎనిమిది ఎకరాల ఎనిమిది గుంటలకు తగ్గించినట్లు వివరించారు. అధికారులను అడిగితే ఎలా బదిలీ అయ్యాయో తమకు కూడా తెలియదని సమాధానం చెబు తున్నట్లు పేర్కొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తనకు అన్యాయం జరిగిందని.. తిరిగి తన భూమిని అప్పగించి న్యాయం చేసే వరకు ఆర్డీవో కార్యా లయం ముందే నిరసన చేపడతానని ఆమె తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 11:31 PM