Share News

గెలుపోటములను సమానంగా భావించాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:16 PM

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా భావించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి క్రీడాకారులకు సూచించారు.

గెలుపోటములను సమానంగా భావించాలి
బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

మల్దకల్‌, జనవరి 11 : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా భావించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి క్రీడాకారులకు సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మల్దకల్‌ గ్రామంలోని క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ ఎంపీపీ పెద్ద వీరన్న, సర్పంచు యాకోబు, ఎంపీటీసీ సభ్యురాలు జయమ్మ, మండల అధ్యక్షుడు వెంకటన్న, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, నాయకులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, సత్యారెడ్డి, సీతారాంరెడ్డి, అజయ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, తిమ్మరాజు, మధు, మహేష్‌, గోవిందు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:16 PM