Share News

మహబూబ్‌నగర్‌ సీటు గెలుపు ప్రతిష్టాత్మకం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:10 PM

రాష్ట్రంలోనే మహబూబ్‌ నగర్‌ సీటు గెలుపు చాలా ప్రతిష్టాత్మకమైనదని బాజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అరుణ ముఖ్య అథితిగా హాజరై, మాట్లాడారు.

మహబూబ్‌నగర్‌ సీటు గెలుపు ప్రతిష్టాత్మకం
సమావేశంలో మాట్లాడుతున్న డీకే అరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌)/దేవరకద్ర, మార్చి 4: రాష్ట్రంలోనే మహబూబ్‌ నగర్‌ సీటు గెలుపు చాలా ప్రతిష్టాత్మకమైనదని బాజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అరుణ ముఖ్య అథితిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణలో మహబూబ్‌నగర్‌ సీటు పక్కా గెలిచే సీటని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. విజయ సంకల్పయాత్ర మైలేజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని, ప్రతీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. ఈనెల ఏడున అసెంబ్లీ కోర్‌ కమిటీ భేటీ కానుందని, 10న శక్తి కేంద్రాల ఏర్పాటు, 12న బూత్‌ లెవల్‌ కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ రెడ్డి, బుడ్డన్న, అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేందర్‌ రెడ్డి, బీజేపీ కన్వీనర్‌ అంజయ్య, రాష్ట్ర నాయకలు మిథున్‌ రెడ్డి, నాయకలు రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కేంద్రంలో మళ్లీ బీజేపీదే విజయం

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రుతి అన్నారు. సోమవారం దేవరకద్ర మండల కేంద్రంలోని పవన్‌కుమర్‌రెడ్డి నివాసంలో అసెంబ్లీ ప్రవాస్‌ యోజన నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అందిస్తున్న పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనువాసులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:10 PM