Share News

మినీ ట్యాంకు బండ్‌ పూర్తి అయ్యేనా?

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:44 PM

జిల్లాకు ముఖ ద్వారమైన మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

మినీ ట్యాంకు బండ్‌ పూర్తి అయ్యేనా?
నత్తనడకన సాగుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ పనులు

- ఏడేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులు

- వాకింగ్‌ ట్రాక్‌ లేక ఇక్కట్లు

మరికల్‌, మార్చి 4 : జిల్లాకు ముఖ ద్వారమైన మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు 40 శాతం పనులు మాత్రమే పూర్తి కాగా, ఇంకా 60 శాతం పనులు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులు మొత్తం పూర్తి అయితే ఆహ్లాదరకంగా ఉండటంతో పాటు వాకింగ్‌ ట్రాక్‌ పూర్తి అయితే ఉదయం, సా యంత్రం వాకింగ్‌ చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పలువురు పట్టణ ప్రజలు పేర్కొంటున్నా రు. వాకింగ్‌ ట్రాక్‌ లేకపోవడంతో వాకర్స్‌ రోడ్డు మీద వాకింగ్‌ చేయడంతో పలు మార్లు ప్రమాదాలు చేటు చేసుకున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మినీట్యాంకు బండ్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:44 PM