Share News

రైతులపై అడవి పంది దాడి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:10 PM

రైతులపై అడవిపంది దాడి చేసి గాయపరిచింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గంగన్‌పల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

రైతులపై అడవి పంది దాడి

జోగుళాంబ గద్వాల జిల్లా గంగన్‌పల్లిలో ఘటన

కేటీదొడ్డి, జూన్‌ 12 : రైతులపై అడవిపంది దాడి చేసి గాయపరిచింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గంగన్‌పల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతులు బాషామౌలాలి, పాంటన్న పొలంలో పనులు చేస్తుండగా అడవిపంది వారిపై దాడి చేసి గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన వారు అల్లపాడులోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ప్రథమ చికిత్స చేయించుకున్నారని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 11:10 PM