అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:07 PM
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి, పేద ప్రజలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
మక్తల్/నర్వ/కృష్ణ, ఫిబ్రవరి 6 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి, పేద ప్రజలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 151మంది లబ్ధిదారుకలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. అదే విధంగా నర్వ మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ మల్‌రెడ్డి ఆధ్వర్యంలో 73 మంది లబ్ధిదారులకు, కృష్ణ మండల కేంద్రంలోని రైతు వేదికలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. మలి విడత కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తులం బంగారం అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సాయం పెంచడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. అతిత్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్ వనజమ్మ, తహసీల్దార్ సువర్ణరాజు, ఆర్‌ఐ భూపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్, నాయకులు లక్ష్మణ్, బోయ రవి, శివశంకర్‌రెడ్డి, కృష్ణ, కురుమయ్య, నర్వలో ఎంపీపీ జయరాములు శెట్టి, ఆర్‌ఐ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య సాగర్, ఎంపీటీసీ సభ్యుడు నీరజ్, పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మన్‌గౌడ్, వివేకవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శరణప్ప, అయ్యన్న, ఆంజనేయులు గౌడ్, కకకృష్ణలో ఎంపీపీ పూర్ణిమ, తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, ఎంపీడీవో యశోద, ఆర్‌ఐలు అమర్‌నాథ్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
మినీ రేషన్ షాపు ప్రారంభం
మాగనూరు : మండలంలోని ఓబులాపూర్‌లో మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీమరి మినీ రేషన్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓబులాపురం గ్రామ పంచాయతీగా ఏర్పడినా అడవి సత్యారం రేషన్‌షాపు డీలర్ పరిధిలో రెండు గ్రామాలు ఉన్నాయని ఒకటి పేగడబండ, రెండోది ఓబులాపురం ఉన్నాయన్నారు. ఓబులాపురం నుంచి అడవిసత్యారం దాదాపు పది కిలో మీటర్ల వెళ్లి రేషన్ తీసుకునేందుకు ఇబ్బంది పడటంతో ఇక్కడే మినీ రేషన్‌షాపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు మండల కేంద్రానికి చెందిన హోటల్ శేఖరప్ప అనారోగ్యంతో మృతి చెందగా ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ శ్యామలమ్మ, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, మాజీ సర్పంచు నారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఆర్‌ఐ శ్రీశైలం, శివరాంరెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.