Share News

ఊరూరా పెళ్లి సందడి

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:37 PM

శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఊరూరా పెళ్లి సందడి నెలకొన్నది. జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను ఆడంబరంగా నిర్వహించారు.

ఊరూరా పెళ్లి సందడి
గద్వాల కోట శ్రీరామ ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

- జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు

- కనుల పండువగా సీతారాముల కల్యాణోత్సవాలు

- పట్టణాలు, గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు

గద్వాల/ గద్వాల టౌన్‌/ అలంపూర్‌ చౌరస్తా/ మా నవపాడు/ ఇటిక్యాల/ అయిజ/ అలంపూర్‌/ వడ్డేపల్లి/ ధరూరు/ మల్దకల్‌/ ఎర్రవల్లి/ కేటీదొడ్డి/ రాజోలి/ ఉండవల్లి/ గట్టు, ఏప్రిల్‌ 17 : శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఊరూరా పెళ్లి సందడి నెలకొన్నది. జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను ఆడంబరంగా నిర్వహించారు. ఉత్సవాలతో పల్లెపల్లెనా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలు కళకళలాడాయి.

- గద్వాల పట్టణంలోని చారిత్రక కోటలో వెలసిన శ్రీరామాలయంలో రాముల వారి కల్యాణాన్ని వైభ వంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ విచారణ కర్త ప్రభాకర్‌రావు, అర్చకులు నరహరి జోషి, రాఘ వేంద్రాచార్య, ధనుంజయాచార్య, పాంచజన్యాచార్య పాల్గొన్నారు. చింతలపేట రామాలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బంబు రామన్‌గౌడ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గడ్డం కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వాసవీ కన్యకా పరమే శ్వరి ఆలయం, రాఘవేంద్ర కాలనీ హనుమాన్‌ ఆల యం, రాంనగర్‌ ఆలయాల్లో నిర్వహించిన వేడుకల కు మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ హాజరై ప్రత్యేక పూజులు చేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు నరహరి శ్రీనివాసులు, శ్రీమన్నారాయణ, మాణిక్యమ్మ, నాగరాజు, నరహరి గౌడు, నాయకులు ఉన్నారు. రాంనగర్‌ రామా లయంలో నిర్వహించిన ఉత్సవాల్లో జిల్లా ప్రధాన న్యాయాధికారి కుశ దంపతులు పాల్గొని పూజలు చేశారు. పిల్లిగుండ్ల కాలనీలోని ముడుపుల ఆంజనేయ స్వామి, అశోక్‌నగర్‌ ఆంజనేయ స్వామి ఆలయాల్లో కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిచారు.

- గద్వాల పట్టణ సమీపంలోని నదీ అగ్రహారం, చెనుగోనిపల్లి రామాలయాల్లో రాముల వారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని కొండపల్లి, సంగాల, కొత్తపల్లి, శెట్టి ఆత్మకూర్‌, ముల్కలపల్లి, బీరోలు, అనంతపురం, పరమాల, కుర్వపల్లి, కాకుళారం, మదనపల్లి, గోనుపాడు గ్రామాల్లో వేడుకలను వైభవంగా జరిపించారు.

- ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు, మెన్నిపాడు, కలుగొట్ల, బొంకూరు తదితర గ్రామాల్లోని ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు. పుల్లూరులో సాయంత్రం రథోత్స వాన్ని కనుల పండువగా నిర్వహించారు.

- మానవపాడు మండలంలోని చెన్నిపాడులో సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహిం చారు. సాయంత్రం రథోత్సవం కనుల పండువగా కొన సాగింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సీతారామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, జ్ఙానేశ్వర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, తిరుమల్‌ రెడ్డి, గుజ్జులగోవర్ధన్‌, ఎల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్‌ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, వెంకటేష్‌, వెంకటపతి, వీరేష్‌, పురుషోత్తం, వెంక టేశ్వర్లు, బీచుపల్లి, రఘురామ్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

- ఇటిక్యాల మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో సుధాపండితులు, రవీంద్రాచార్యుల ఆధ్వ ర్యంలో సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యురాలు వెంకటేశ్వరమ్మ, యుగంధర్‌రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. శివాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మండలంలోని చాగాపురం, మునుగాల, గోపలదిన్నె, సాతర్ల, వావిలాల గ్రామాల్లోని ఆలయాలో కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- అయిజ పట్టణంలోని మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలను ఘన ంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఉప్పల క్యాంపులోని రామాలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకలకు ఎంపీపీ ప్రహ్లాదరెడ్డి, ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవానికి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నర్సింహులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వీరబ్రహ్మేంద్రాలయంలో నిర్వహించి న ఉత్సవాలకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- అలంపూర్‌ పుణ్యక్షేత్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకలకు న్యాయాధికారి కమలాపురం కవిత, జోగుళాంబ ఆలయ చైర్మన్‌ చిన్న కృష్ణయ్య, ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ, మాజీ ధర్మకర ్త శెట్టి హాజరయ్యారు.

- వడ్డేపల్లి మునిసిపాలిటీ కేంద్రమైన శాంతి నగర్‌లోని రామాలయంలో కల్యాణ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ చౌదరి ఇంటి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్లను ఆసీనులను చేసి అర్చ కుడు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వైభ వంగా నిర్వహించారు. మండలంలోని పైపాడు, గాంధీ నగర్‌లలోని రామాలయాల్లో సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. సాయంత్రం సీతా రాముల విగ్రహాలతో గ్రామాల్లో ఊరేగింపు నిర్వహిం చారు. తిమ్మాజిపల్లిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయోధ్య బాలరాముడి భారీ ఫ్లెక్సీతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరసిం హులు, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు.

- మల్దకల్‌ మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, తాటికుంట సీతారామాలయం, కొర్తిరావల్‌చెర్వు గ్రామంలోని పట్టాభి సీతారామాంజనేయ స్వామి దేవాలయాల్లో సీతారాముల కల్యాణో త్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆదిశిలా క్షేత్రంలో జరిగిన కల్యాణ వేడుకలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు పాల్గొన్నారు.

- ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి కోదండారామాలయంలో అర్చకుడు సుదర్శన్‌ నారాయణన్‌ స్వామి బృందం, మేనేజర్‌ సురేందర్‌ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఆవుల మోహన్‌ బాబు అన్నదానం చేశారు. కల్యాణ వేడుకలకు పదో బెటాలియన్‌ కమాండెంట్‌ సాంబయ్య, ఇటిక్యాల ఎంపీపీ స్నేహ హాజరయ్యారు.

- కేటీదొడ్డి మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంతో పాటు వెంకటాపురం, కొండాపురం, పాతపాలెం, కుచినెర్ల గ్రామాల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కేటీదొడ్డిలోని ఆంజనేయస్వామి, పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. కేటీదొడ్డికి చెందిన పిల్లి శ్రీనివాసులు కుమారుడు సృజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదానం చేశారు.

- కొత్త రాజోలిలోని రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి సన్నిధిలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి సత్‌సంఘ్‌ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు పుస్తెలు, తలంబ్రాలు, ము త్యాలు, పట్టువస్త్రాలను తీసుకొని ఊరేగింపుగా రామా లయానికి చేరుకున్నారు. అనంతరం స్వామి వారి కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాజోలిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహిం చారు. మాజీ సర్పంచు శ్రీరామ్‌రెడ్డి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు.

- ఉండవల్లి మండల కేంద్రంలోని ఆంజనే యస్వామి, మణికంఠ అయ్యప్పస్వామి, కోదండరామ స్వామి ఆలయాల్లో రాములవారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అశ్వమేధ వాహనంలో ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి, శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వేషధారణతో ఊరేగింపులో పాల్గొని ఆకట్టుకున్నారు. రాములవారి పాటలకు చిన్నారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన అలరించింది.

- గట్టు మండల పరిధిలోని గట్టు, చాగదోణ, చిన్నోనిపల్లి, తప్పట్లమొర్సు, ఆలూరు గ్రామాల్లో సీతా రాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

Updated Date - Apr 17 , 2024 | 11:37 PM