Share News

ప్రజా సమస్యలపై గళం వినిపిస్తాం

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:48 PM

కాంగ్రెస్‌తో స్నేహ బంధాన్ని కాపాడుకుంటూనే అసెంబ్లీలో ప్రజా సమ స్యలపై గళం వినిపిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు.

 ప్రజా సమస్యలపై గళం వినిపిస్తాం
ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కూచకళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిలను సన్మానిస్తున్న సీపీఐ నాయకులు

- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

- సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఘన సన్మానం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 12: కాంగ్రెస్‌తో స్నేహ బంధాన్ని కాపాడుకుంటూనే అసెంబ్లీలో ప్రజా సమ స్యలపై గళం వినిపిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్‌లో సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ అధ్యక్షతన కొత్తగూడెం ఎమ్మెల్యే కూ నంనేని సాంబశివరావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దా మోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డిలను ఘనంగా సన్మానిం చి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశంలో కమ్యునిస్టులపై నిషే ధం ఉన్న కాలం నాటి నుంచి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నామన్నారు. దేశంలో ప్రజా సమస్యలపై చేసిన ప్రతి చట్టం వెనుక కమ్యూనిస్టుల పాత్ర ఉందన్నారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడని కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ నిజాయతీ, చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబ డతారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఉంది కాదనలేమని, కానీ సాయుధ పోరాటాల నాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భంగా కమ్యూనిస్టులు కూడా కీలక పాత్ర పోషించారన్నారు. క మ్యూనిస్టులతో సంబంధం వి ఫలం చెందినప్పుడే బీఆర్‌ఎస్‌ పతనం చెందిందన్నారు. క మ్యూనిస్టులు కాంగ్రెస్‌తో పొ త్తు పెట్టుకున్నది సీట్ల కోసం కాదని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఓడించి ఆ పార్టీ చీకటి స్నేహ బంధం కొనసాగిస్తు న్న కేంద్రంలోని బీజేపీని బ లహీన పరచాలనే లక్ష్యం కోసమని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడా నికి సీపీఐ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ నియోజవర్గంలో సీపీఐ బలంగా ఉన్న గ్రామాలను గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చా రన్నారు. నియోజకవ ర్గంలోని సీపీఐ నాయకులతో తనకు చాలా కాలం నుం చి మంచి సంబంధాలు ఉన్నాయని, అదే బంధాన్ని కొ సాగిస్తూ నియోజవర్గం అభివృద్ధికి కలిసి పని చేస్తామ ని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రం అసెంబ్లీకి నాతో పాటు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు కూనంనేని ప్రసంగాలు స్ఫూర్తి నిశ్చయ న్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎ లాంటి అన్యాయం జరుగకుండా చూసుకుంటానని హా మీ ఇచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ మా ట్లాడుతూ అభివృద్ధి అంటే పెళ్లిళ్లు, ఉచిత భోజనాలు కా దని, మౌలిక సదుపాయాల కల్పన అని ఎన్నికల్లో ని యోజకవర్గ ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. గత పాలకులు విస్మరించిన కేఎల్‌ఐ పెండింగ్‌ పనులు, పరి శ్రమల, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు పాటు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్‌.ఆనంద్‌జీ, వార్ల వెం కటయ్య, కేశవు లుగౌడ్‌, నాయకులు కందాల రామకృష్ణ, ఎండీ.ఫయాజ్‌, ఏసయ్య, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు శ్రీనివాసు లు, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:48 PM